హింస లేకుండా నవ్వించే చంద్రయాన్ సినిమా నేడు విడుదల

చంద్రయాన్ సినిమా: ‘ఈ సినిమా కథలో ఒక సరదా పాయింట్ ఉంది. అందుకే వేణు ఊడుగుల టేకాఫ్ చేశారు. వినూత్న కథాంశంతో కొత్త టీమ్ చేసిన ప్రయత్నాన్ని మీరందరూ ప్రోత్సహించాలి’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. బుధవారం జరిగిన ‘చంద్రయాన్’ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది.

చంద్రయాన్ సినిమా, NewzFast Telugu: ‘ఈ సినిమా కథలో ఒక సరదా పాయింట్ ఉంది. అందుకే వేణు ఊడుగుల టేకాఫ్ చేశారు.

వినూత్న కథాంశంతో కొత్త టీమ్ చేసిన ప్రయత్నాన్ని మీరందరూ ప్రోత్సహించాలి’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు.

బుధవారం జరిగిన ‘చంద్రయాన్’ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆయుధాలు, రక్తపాతాలు లేని సినిమా ఇదని, జీవితంలో ఎలాంటి సమస్య ఉన్నా వాటన్నింటినీ మర్చిపోయి రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకుంటారని దర్శకుడు శ్రీనాథ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇదొక లాఫింగ్ థెరపీ అని ఆయన తెలిపారు.

వినూత్న ఆలోచనతో రూపొందిన ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నట్లు వేణు ఊడుగుల తెలిపారు. అరుదుగా వచ్చే ఈ తరహా కథాంశాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రానికి మద్దతు ఇస్తున్నానని ఆయన చెప్పారు.

గ్రామీణ నేపథ్యంలో ఆద్యంతం వినోదాత్మకంగా సాగే సినిమా ఇదని చిత్ర నిర్మాత ప్రవీణ్ మొలక పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు