చంద్రయాన్ సినిమా, NewzFast Telugu: వినూత్న కథాంశంతో రూపొందిన ‘చంద్రయాన్’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన హీరో శ్రీవిష్ణు, ఈ సినిమా కథలో సరదా అంశం ఉందని, అందుకే వేణు ఊడుగుల టేకాఫ్ చేశారని పేర్కొన్నారు.
కొత్త టీమ్ చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ప్రోత్సహించాలని శ్రీవిష్ణు కోరారు. శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు.
ఆయుధాలు, రక్తపాతాలు లేని సినిమా ఇదని, జీవితంలోని సమస్యలన్నీ మర్చిపోయి రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకోవచ్చని దర్శకుడు శ్రీనాథ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇదొక లాఫింగ్ థెరపీ అని ఆయన పేర్కొన్నారు.
వినూత్న ఆలోచనతో రూపొందిన ఈ తరహా కథాంశాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సమర్పకుడిగా వ్యవహరిస్తున్నట్టు వేణు ఊడుగుల చెప్పారు. గ్రామీణ నేపథ్యంలో ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రాన్ని నిర్మాత ప్రవీణ్ మొలక నిర్మించారు.
ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.




