సీసీఐ కొనుగోలు కేంద్రం, NewzFast Telugu (కోనరావుపేట, కరీంనగర్): సీసీఐ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సూచించారు. కోనరావుపేట మండలం సుద్దాల కావేరి పత్తి మిల్లులో గురువారం సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పండించిన పత్తిని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాల్‌కు 8,600 రూపాయలకు, 8 శాతం తేమతో విక్రయించాలని ఆయన తెలిపారు. అధికారుల సూచనలు పాటించాలని కూడా రైతులను కోరారు.
దేశంలో ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని నగేష్ పేర్కొన్నారు. వ్యవసాయంలో నీటి వినియోగం తక్కువగా ఉండే అరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ ఆత్మ కమిటీ అధ్యక్షుడు ముస్కు ముకుందరెడ్డి, ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, తహసీల్దార్ వరలక్ష్మి, ప్యాక్స్ చైర్మన్లు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మానుక సత్యం, వ్యవసాయ మార్కెటింగ్ అధికారి ప్రకాష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.




