కాలిఫోర్నియా దీపావళి వేడుకలు, NewzFast Telugu (కాలిఫోర్నియా): కాలిఫోర్నియాలోని వైదిక విద్యా గణపతి సెంటర్ దేవాలయంలో దీపావళి ఉత్సవాలు, గోవర్ధన పూజ ఘనంగా జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి.
ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని ఆనందంగా గడిపారు. దేవస్థానం నిర్వాహకులు ఈ మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
సంప్రదాయంగా వస్తున్న కొన్ని ఉత్సవాలను కూడా నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులు మూడు రోజుల పాటు దీపాలు వెలిగించారు. రథయాత్రను కూడా నిర్వహించగా, స్థానికులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.
ఇందులో యువత కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.
చివరి రోజు లక్ష్మీ కుబేర పూజను శ్రద్ధా భక్తులతో నిర్వహించారు. అదే రోజు గోవర్ధన పూజ కూడా జరిగింది.
ప్రతి రోజు దేవాలయంలో ప్రత్యేక ప్రసాదాలను నివేదించి భక్తులకు పంపిణీ చేశారు.
ఈ మూడు రోజుల పాటు ప్రత్యేకంగా కిడ్స్ దీప పూజ, హారతి కూడా నిర్వహించారు.




