BRS Rythu Garjana Adilabad meeting KTR congratulates leaders, NewzFast Telugu (Telangana): ఆదిలాబాద్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రైతుగర్జన సభ విజయవంతం కావడంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా నాయకులు, కార్యకర్తలను అభినందించారు.
అదే స్ఫూర్తితో పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని, రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. సభ విజయంతో ఆగిపోకుండా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.
బుధవారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి జోగు రామన్న, నాయకులు భార్గవ్ దేశ్‌పాండే, జోగు మహేందర్ కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరగా, వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్ బలోపేతానికి ప్రతి ఒకరూ సమిష్టిగా కృషిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
