తెలంగాణలో బీజేపీ అధికారం, NewzFast Telugu: సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర విమర్శలు చేశారు. అమిత్ షా తెలంగాణ మొత్తం మోకాళ్లపై తిరిగినా ఇక్కడ బీజేపీ అధికారంలోకి రాదని ఆయన స్పష్టం చేశారు.
దేశంలో మూడు కోట్ల మంది చొరబాటుదారుల ఓట్లను తొలగించామని అమిత్ షా వ్యాఖ్యానించడం ఆయన అసమర్థతకు నిదర్శనమని నరసింహ విమర్శించారు. గత 12 ఏళ్లుగా హోంమంత్రిగా ఉన్న అమిత్ షా, ఇంతమంది చొరబాటుదారులు దేశంలోకి ప్రవేశిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఈ బాధ్యత వహిస్తూ అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన వారందరినీ విదేశీయులుగా చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం ప్రజాస్వామ్యానికి హానికరమని ఆయన విమర్శించారు.
