బిగ్ బాస్ తెలుగు 10 ఎలిమినేషన్, NewzFast Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఇప్పటికే తొమ్మిది వారాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పదో వారంలో ఫ్యామిలీ వీక్ నడుస్తోంది.
కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు, సన్నిహితులు హౌస్‌లోకి వచ్చి వారిలో ఉత్సాహం నింపుతూ, ఆట గట్టిగా ఆడాలని సలహాలు ఇస్తున్నారు.
ఫ్యామిలీ వీక్‌లో కంటెస్టెంట్లు సంతోషంగా గడుపుతుండగా, మరోవైపు నామినేషన్ జాబితా, ఎలిమినేషన్ దిశగా ఉన్నవారి వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పదో వారానికి టెంపర్ వంశీ హౌస్ కెప్టెన్‌గా సేఫ్ జోన్లో నిలవగా, మిగిలిన 12 మంది పోటీదారులు ఈ వారం నామినేట్ అయ్యారు.
నామినేషన్లో ఉన్నవారిలో త్రిగుణ్, ముఖేష్, శివకుమార్, రామకృష్ణ, సుధీర్ రెడ్డి, అమన్, వర్షిణి సౌందరరాజన్, నీతూ నటరాజ్, శ్వేతా నాయుడు, దేబ్జానీ, ఆటో రామ్‌ప్రసాద్, జబర్దస్త్ నరేష్ ఉన్నారు. గత వారం దీపావళి సందర్భంగా ఎవరినీ ఎలిమినేట్ చేయబోమని చెబుతూనే, కంటెస్టెంట్లకు ఎలాంటి మినహాయింపులు ఉండవని నాగార్జున హెచ్చరించారు.
ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తుండగా, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి ఓటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.
అన్ అఫీషియల్ పోల్స్‌లో ముఖేష్ అగ్రస్థానంలో ఉండగా, త్రిగుణ్ రెండో స్థానంలో ఉన్నారు. రోహిత్ ఎలిమినేట్ కావడంతో అతని అభిమానులు ముఖేష్‌కు ఓటు వేస్తున్నారని చెబుతున్నారు.
దేబ్జానీ మూడో స్థానంలో, అమన్ నాలుగో స్థానంలో, జబర్దస్త్ నరేష్ ఐదో స్థానంలో, రామ్‌ప్రసాద్ ఆరో స్థానంలో ఉన్నట్లు ఈ పోల్స్ సూచిస్తున్నాయి. మిగతా స్థానాల్లో సుధీర్, శ్వేత, శివకుమార్, వర్షిణి, నీతూ మాస్టర్ ఉన్నారు.
గత వారం ఎలిమినేషన్ నుంచి శివకుమార్, సుధీర్, నీతూ మాస్టర్ తృటిలో తప్పించుకున్నారు.
ప్రస్తుతం ఓటింగ్ ఇంకా కొనసాగుతున్నందున ఎలిమినేషన్ ఫలితంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటి ట్రెండ్ ప్రకారం నీతూ మాస్టర్, సుధీర్ ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఈ అంశం వైరల్ కావడంతో త్రిగుణ్‌ను కెలికితే హౌస్ విడవాల్సిందేనా అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఇవి అనధికారిక అంచనాలే అని గమనించాలి.




