ప్రజాస్వామ్య పరిరక్షణకే భారత్‌ సమ్మిట్‌ 2.0: హైదరాబాద్‌లో నవంబరు 12 నుంచి సదస్సు

భారత్ సమ్మిట్ 2.0: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న హింస, విద్వేష రాజకీయాలు, విభజన ధోరణుల నేపథ్యంలో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకే భారత్‌ సమ్మిట్‌ 2.0ను నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నవంబరు 12, 13, 14 తేదీల్లో ఈ సదస్సు జరగనుందని బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌తో కలిసి భట్టి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.

భారత్ సమ్మిట్ 2.0, NewzFast Telugu (హైదరాబాద్): ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న హింస, విద్వేష రాజకీయాలు, విభజన ధోరణుల నేపథ్యంలో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకే భారత్‌ సమ్మిట్‌ 2.0ను నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నవంబరు 12, 13, 14 తేదీల్లో ఈ సదస్సు జరగనుందని బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు.

మంత్రి శ్రీధర్‌బాబు, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌తో కలిసి భట్టి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులు, ఉదారవాదులు, ప్రగతిశీల భావాలు కలిగినవారిని ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకెళ్తోందని ఆయన అన్నారు.

ఈ సదస్సులో పాల్గొనేందుకు 70కి పైగా దేశాల నుంచి 1,000 మందికి పైగా ప్రజాప్రతినిధులు, విధాన నిర్ణేతలు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు అంగీకారం తెలిపారని భట్టి వెల్లడించారు. ప్రభుత్వం, ప్రతిపక్షం ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలక స్తంభాలని ఆయన స్పష్టం చేశారు.

అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షాలను శత్రువులుగా కాకుండా రాజకీయ ప్రత్యర్థులుగానే చూడాలని సూచించారు.

ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రతిపక్ష పార్టీలను శత్రువులుగా చూస్తున్నారని, వాటిని రాజకీయంగా అంతం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. సర్‌ ప్రక్రియ పేరుతో అర్హులైన పౌరుల ఓటు హక్కును తొలగించే ప్రయత్నాలను కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని ఆయన అన్నారు.

భారత్‌ సమ్మిట్‌ రాజకీయాల కోసం కాదని, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు చూపడమే లక్ష్యమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీని రీ లాంచ్‌ చేయడానికే ఈ సదస్సు అన్న బీజేపీ నేతల వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

ఈ సదస్సులో యువత, సాంకేతికత తదితర అంశాలపై చర్చ జరుగుతుందని తెలిపారు.

సదస్సు విజయానికి అందరూ సహకరించాలని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కోరారు. గత ఏడాది హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని, రెండో సారి నిర్వహణకు కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం సహకారం అందించిందని సల్మాన్‌ ఖుర్షీద్‌ చెప్పారు.

భవిష్యత్తులో ఈ సదస్సు హైదరాబాద్‌లో శాశ్వత కార్యక్రమంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు