భద్రాద్రి కొత్తగూడెం: ఉప్పొంగుతున్న వాగులు, నిలిచిన రాకపోకలు

భద్రాద్రి కొత్తగూడెం వాగుల వరద: మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో చుంచుపల్లి మండలంలో వాగులు ఉప్పొంగుతున్నాయి. పెనుబల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గోధుమ వాగుతో పాటు పెనగడప–ములుగుగూడెం వాగులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులపై ఉన్న బ్రిడ్జిల మీదుగా నీరు పారుతుండటంతో ఆయా గ్రామాల నుంచి కొత్తగూడెం పట్టణానికి రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి ప్రమాదకరంగా మారడంతో పెనుబల్లి వాగు వద్ద స్థానికులు అప్రమత్తమయ్యారు. ఎవరూ వాగు దాటేందుకు ప్రయత్నించకుండా బ్రిడ్జిపై అడ్డంగా ట్రాక్టర్‌ను నిలిపి రాకపోకలను నియంత్రిస్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా.

భద్రాద్రి కొత్తగూడెం వాగుల వరద, NewzFast Telugu (చుంచుపల్లి మండలం): మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో చుంచుపల్లి మండలంలో వాగులు ఉప్పొంగుతున్నాయి. పెనుబల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గోధుమ వాగుతో పాటు పెనగడప–ములుగుగూడెం వాగులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

వాగులపై ఉన్న బ్రిడ్జిల మీదుగా నీరు పారుతుండటంతో ఆయా గ్రామాల నుంచి కొత్తగూడెం పట్టణానికి రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి ప్రమాదకరంగా మారడంతో పెనుబల్లి వాగు వద్ద స్థానికులు అప్రమత్తమయ్యారు.

ఎవరూ వాగు దాటేందుకు ప్రయత్నించకుండా బ్రిడ్జిపై అడ్డంగా ట్రాక్టర్‌ను నిలిపి రాకపోకలను నియంత్రిస్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో వాగు దాటడం ప్రమాదకరమని హెచ్చరిస్తూ ప్రజలను అడ్డుకుంటున్నారు.

వాగులపై రాకపోకలు నిలిచిపోవడంతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలు సరఫరా చేసేవారు, నిత్యావసర సరుకుల కోసం పట్టణానికి వెళ్లేవారు, కూలీలు, ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

వర్షాలు కొనసాగుతుండటంతో వరద ప్రవాహం ఎప్పుడు తగ్గుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రమాదకర ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

వరద ప్రవాహం తగ్గే వరకు ఎవరూ వాగులు దాటకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు