భద్రాచలం గోదావరి ప్రమాదాలు హైకోర్టు నోటీసులు, NewzFast Telugu (భద్రాచలం): భద్రాచలం వద్ద గోదావరి నదిలో ప్రమాదవశాత్తు పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడంపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఏపీలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన ఐదుగురు విద్యార్థులు ఇటీవల భద్రాచలం వద్ద గోదావరి నదిలో పడి మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో సరైన రక్షణ చర్యలు తీసుకునేలా అధికార యంత్రాంగాన్ని ఆదేశించాలంటూ జస్టిస్ నగేశ్ భీమపాక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.
దీనిని సుమోటోగా విచారణకు స్వీకరించిన ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, ఎస్పీ, నీటిపారుదలశాఖ, మునిసిపల్ శాఖ, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తదితర శాఖల అధికారులకు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
