ఫోర్డ్ ట్రోఫీలో బెవాన్ జాకబ్స్ 21 సిక్సర్లతో డబుల్ సెంచరీ, ఆక్లాండ్ ఓటమి

బెవాన్ జాకబ్స్: న్యూజిలాండ్ యువ బ్యాటర్ ఫోర్డ్ ట్రోఫీలో ఆక్లాండ్ తరఫున 135 బంతుల్లో 21 సిక్సర్లు, 13 ఫోర్లతో 202 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతడి విధ్వంసకర ప్రదర్శన ఉన్నప్పటికీ ఒటాగో చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఆక్లాండ్ ఓడిపోయింది. ఒటాగో 335 పరుగుల లక్ష్యాన్ని ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

బెవాన్ జాకబ్స్, NewzFast Telugu (ఆక్లాండ్, న్యూజిలాండ్): న్యూజిలాండ్ యువ బ్యాటర్ బెవాన్ జాకబ్స్ దేశవాళీ క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. ఫోర్డ్ ట్రోఫీలో ఆక్లాండ్ తరఫున ఆడుతూ విధ్వంసకర డబుల్ సెంచరీతో చెలరేగాడు.

కేవలం 135 బంతుల్లోనే 21 సిక్సర్లు, 13 ఫోర్లతో 202 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే బెవాన్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు.

ప్రత్యర్థి ఒటాగో జట్టు 335 పరుగుల టార్గెట్ ను ఐదు బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్ల తేడాతో ఛేదించింది.

ముఖ్యంగా ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అతడి విధ్వంసం పతాకస్థాయికి చేరింది. అప్పటివరకు 172 పరుగులతో నాటౌట్‌గా ఉన్న జాకబ్స్..

లెగ్ స్పిన్నర్ జాక్ కమింగ్ వేసిన ఆఖరి ఓవర్‌లో ఏకంగా ఐదు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో ఈడెన్ పార్క్ ఔటర్ ఓవల్ మైదానాన్ని సిక్సర్లతో హోరెత్తించాడు.

ఓవరాల్ గా జాకబ్స్ ఇన్నింగ్స్‌లో మొత్తం 21 సిక్సర్లు నమోదయ్యాయి.

లిస్ట్-ఎ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన డార్సీ షార్ట్ ప్రపంచ రికార్డుకు జాకబ్స్ కేవలం రెండు సిక్సర్ల దూరంలో నిలిచాడు. ఇండియాతో ఇటీవల న్యూజిలాండ్ తరఫున టీ20 మ్యాచ్‌లు ఆడిన జాకబ్స్..

స్వదేశీ జట్టులోకి తిరిగి వచ్చిన మూడో మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించాడు.

ఇప్పటివరకు 33 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడిన అతడికి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. అంతకుముందు 2017-18 సీజన్‌లో కోలిన్ మున్రో చేసిన 174 పరుగుల నాటౌట్ స్కోరే ఆక్లాండ్ బ్యాటర్ అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉండేది.

ఇప్పుడు జాకబ్స్ ఆ రికార్డును అధిగమించాడు.

335 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఒటాగో బ్యాటర్లు సమష్టిగా రాణించారు. టాప్-5లో ముగ్గురు ఆటగాళ్లు అర్ధ సెంచరీలు సాధించారు.

ఓపెనర్ జాక్ బాయిల్ 61 బంతుల్లో 62 పరుగులు చేయగా, యువ వికెట్ కీపర్ బ్యాటర్ మాక్స్ చూ 55 బంతుల్లో 75 పరుగులతో మెరిశాడు.

ముఖ్యంగా విజయానికి అవసరమైన చివరి బౌండరీని కూడా మాక్స్ చూ సాధించడం విశేషం. దీంతో ఒటాగో ఐదు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది.

ఫోర్డ్ ట్రోఫీ చరిత్రలో జాకబ్స్ సాధించిన 202 పరుగుల నాటౌట్ స్కోరు మూడో డబుల్ సెంచరీగా నిలిచింది.

మరోవైపు ప్రపంచ లిస్ట్-ఎ క్రికెట్‌లో ఓటమితో ముగిసిన నాలుగో డబుల్ సెంచరీగా కూడా ఇది నమోదైంది. గతంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ 202 పరుగులు చేసినప్పటికీ శ్రీలంక 430 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

అలాగే బెన్ డంక్ (229 నాటౌట్), స్వస్తిక్ సమల్ (212) కూడా డబుల్ సెంచరీలు చేసినా వారి జట్లు ఓటమి పాలయ్యాయి.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు