పెళ్లి పత్రిక ఇచ్చి తిరిగి వస్తుండగా ప్రమాదం, సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సహా ఇద్దరు మృతి

బెంగళూరు రోడ్డు ప్రమాదం: పెళ్లి సందడి నెలకొనాల్సిన ఆ ఇంట తీవ్ర విషాదం అలుముకుంది. మరికొద్ది గంటల్లో పసుపు వేడుక జరుపుకోవాల్సిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, మరో యువతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి పత్రికను బంధువులకు ఇచ్చి తిరిగి వస్తుండగా లారీ రూపంలో మృత్యువు కబళించింది. బుధవారం సాయంత్రం బెంగళూరులోని దీపాంజలినగర్ ప్రాంతంలో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, బెంగళూరుకు చెందిన 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సింధుశ్రీకి పెళ్లి సెట్ అయింది. గురువారం నాడు.

బెంగళూరు రోడ్డు ప్రమాదం, NewzFast Telugu (బెంగళూరు): పెళ్లి సందడి నెలకొనాల్సిన ఆ ఇంట తీవ్ర విషాదం అలుముకుంది. మరికొద్ది గంటల్లో పసుపు వేడుక జరుపుకోవాల్సిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, మరో యువతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

పెళ్లి పత్రికను బంధువులకు ఇచ్చి తిరిగి వస్తుండగా లారీ రూపంలో మృత్యువు కబళించింది. బుధవారం సాయంత్రం బెంగళూరులోని దీపాంజలినగర్ ప్రాంతంలో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.

సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, బెంగళూరుకు చెందిన 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సింధుశ్రీకి పెళ్లి సెట్ అయింది. గురువారం నాడు సింధుశ్రీ వివాహ వేడుకల్లో భాగంగా పసుపు వేడుక, బాలె శాస్త్ర కార్యక్రమాలు జరగాల్సి ఉంది.

ఆదివారం వివాహ రిసెప్షన్‌కు కుటుంబ సభ్యులు ఘనంగా ఏర్పాట్లు చేశారు.

బుధవారం సాయంత్రం సింధుశ్రీ తన బంధువుకు పత్రిక ఇవ్వడానికి మేనత్త కూతురు విద్యతో కలిసి స్కూటీపై వెళ్లింది. పత్రిక ఇచ్చి తిరిగి వస్తుండగా లారీ స్కూటీని ఢీకొట్టింది.

దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

గురువారం మార్చురీ వద్ద తన ఏకైక కుమార్తె మృతదేహాన్ని చూసి తండ్రి నంజుండప్ప గుండెలవిసేలా రోదించారు. ‘‘నేను ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాను.

నా కుమార్తె సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. పెళ్లి పత్రిక ఇవ్వాల్సి ఉందని చెప్పి బయటకు వెళ్లింది.

తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. ఈరోజు పసుపు వేడుక జరుపుకోవాల్సిన నా బిడ్డకు అంత్యక్రియలు చేయాల్సి వస్తోంది’’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు