బారా గల్లీ డ్రైనేజీ సమస్యకు తక్షణ చర్యలు: తలసాని పర్యటన

బారా గల్లీ డ్రైనేజీ సమస్య: భవిష్యత్తులో డ్రైనేజీ సమస్య ఏర్పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. మోండా డివిజన్‌లోని బారా గల్లీలో డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని ఇటీవల బస్తీ వాసులు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యను విన్నవించారు. స్పందించిన ఆయన గురువారం వివిధ శాఖల అధికారులతో కలిసి బారా గల్లీలో పర్యటించారు. బస్తీని ఆనుకుని ఉన్న ఇస్లామియా స్కూల్ ఆవరణలో గోడ కూలిపోయి డ్రైనేజీ పైప్‌లైన్ చాంబర్‌పై పడిపోయిందని, దీంతో.

బారా గల్లీ డ్రైనేజీ సమస్య, NewzFast Telugu (సికింద్రాబాద్, మోండా డివిజన్): భవిష్యత్తులో డ్రైనేజీ సమస్య ఏర్పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. మోండా డివిజన్‌లోని బారా గల్లీలో డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని ఇటీవల బస్తీ వాసులు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యను విన్నవించారు.

స్పందించిన ఆయన గురువారం వివిధ శాఖల అధికారులతో కలిసి బారా గల్లీలో పర్యటించారు. బస్తీని ఆనుకుని ఉన్న ఇస్లామియా స్కూల్ ఆవరణలో గోడ కూలిపోయి డ్రైనేజీ పైప్‌లైన్ చాంబర్‌పై పడిపోయిందని, దీంతో మురుగు నీటి ప్రవాహం నిలిచిపోయిందని బస్తీ వాసులు వివరించారు.

ఈ పరిస్థితిపై స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఇక్కడ నివసించే వారంతా పేదలేనని, వారికి ఏ సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత తనపై ఉందని అన్నారు. వెంటనే చాంబర్ మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు.

అదేవిధంగా బారా గల్లీ మొత్తం నూతన డ్రైనేజీ లైన్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. డ్రైనేజీ లైన్ ఏర్పాటు చేసిన అనంతరం బస్తీలో అవసరమైన ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

ఈ పర్యటనలో బోయిన్‌పల్లి సర్కిల్ డిసి, ఏఈ, వాటర్ వర్క్స్ మేనేజర్, శానిటేషన్ అధికారి, స్ట్రీట్ లైట్ ఏఈ, హార్టికల్చర్ అధికారితో పాటు డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, స్థానిక నాయకులు, బస్తీ వాసులు పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు