అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఎంకోర్ ఓటీటీ స్ట్రీమింగ్, NewzFast Telugu: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుంచి వచ్చిన రీసెంట్ విజువల్ వండర్ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎంకోర్’ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 25న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదలైంది.
ఐమాక్స్, ఇన్ఫినిటీ విజన్ సమర్పణలో మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం 4DX, MX4D, SCREEN X, డాల్బీ విజన్, HDR BARCO, ICE వంటి ప్రీమియం ఫార్మాట్లలో విడుదల చేయబడింది. భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే రికార్డు కలెక్షన్లు వచ్చాయి.
ఇండియాలో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు జియో హాట్‌స్టార్ వద్ద ఉన్నాయి. ఈ శుక్రవారం, నవంబర్ 13 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది.
ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ ఇది అందుబాటులో ఉంటుంది.
ఈ చిత్రాన్ని కెవిన్ ఫైజ్ నిర్మించగా, ఆంథోనీ రస్సో, జో రస్సో దర్శకత్వం వహించారు. కథలో థానోస్ కారణంగా విశ్వంలోని సగం జనాభా నాశనమవుతుంది.
మిగిలిన సూపర్ హీరోలు ఆ విషాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తారు.
చివరికి తమ ప్రియమైన వారిని తిరిగి తీసుకురావడంతో పాటు విశ్వంలో శాంతి, సమతుల్యతను పునరుద్ధరించేందుకు వారు థానోస్‌తో తలపడాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏమైందన్నదే ఈ సినిమా కథ.




