ఆశా వర్కర్ల కనీస వేతనం, NewzFast Telugu (నాగర్కర్నూల్, తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలకు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి ఆశా వర్కర్లు ధర్నా చేశారు. రాష్ట్రంలో ఇరవై ఏళ్లుగా చాలీచాలని జీతాలతో గర్భిణులకు సేవలు అందిస్తున్నారని ఆయన అన్నారు.
పనిభారం తగ్గించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన కోరారు.
ఇదే అంశంపై కల్వకుర్తిలో కూడా ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లకుపైగా వైద్య సేవలందిస్తున్న తమకు కనీస వేతనం అమలు చేయడం లేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.
ఆంజనేయులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆనంద్ కుమార్కు వినతిపత్రం అందజేశారు.
ఈ నెలాఖరులోగా నెలకు రూ.18 వేల కనీస వేతనం, ఉద్యోగ భద్రత, బీమా సౌకర్యం, హెల్త్ కార్డులు కల్పించాలని ఆయన కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబరు 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.




