అండర్‌-19 ఆసియా కప్‌ సెమీఫైనల్‌: అఫ్ఘానిస్థాన్‌తో భారత్‌ పోరు, ఆర్యవీర్‌పై అందరి దృష్టి

ఆర్యవీర్ సెహ్వాగ్: అండర్‌-19 ఆసియా కప్‌ వన్డే టోర్నీలో భారత జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. గురువారం జరిగే సెమీఫైనల్లో అఫ్ఘానిస్థాన్‌ను భారత్‌ ఎదుర్కోనుంది. మ్యాచ్‌ ఉదయం 10.30 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది. యూఏఈతో చావో రేవో పోరులో అద్భుత శతకం (160) సాధించిన ఓపెనర్‌ ఆర్యవీర్‌ సెహ్వాగ్‌పైనే అందరి దృష్టి నిలిచింది. టీమిండియా మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనయుడైన ఆర్యవీర్‌ ఈ ఆసియా కప్‌లో ప్రస్తుతం అత్యధిక పరుగులు (252) చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

ఆర్యవీర్ సెహ్వాగ్, NewzFast Telugu (అల్ అమీరత్, ఒమన్): అండర్‌-19 ఆసియా కప్‌ వన్డే టోర్నీలో భారత జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. గురువారం జరిగే సెమీఫైనల్లో అఫ్ఘానిస్థాన్‌ను భారత్‌ ఎదుర్కోనుంది.

మ్యాచ్‌ ఉదయం 10.30 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది.

యూఏఈతో చావో రేవో పోరులో అద్భుత శతకం (160) సాధించిన ఓపెనర్‌ ఆర్యవీర్‌ సెహ్వాగ్‌పైనే అందరి దృష్టి నిలిచింది. టీమిండియా మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనయుడైన ఆర్యవీర్‌ ఈ ఆసియా కప్‌లో ప్రస్తుతం అత్యధిక పరుగులు (252) చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

సొహైల్‌ ఖాన్‌ సారథ్యంలోని అఫ్ఘానిస్థాన్‌పైనా అతడు అదే జోరు కొనసాగిస్తాడని అంచనా.

ఆర్యవీర్‌తో పాటు అర్జున్‌ రాజ్‌పుత్‌ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అర్జున్‌ 107 పరుగులు చేశాడు.

బౌలింగ్‌ విభాగంలో మీడియం పేసర్‌ ఇషాన్‌ సూద్‌ (ఎనిమిది వికెట్లు), ఎడమచేతి వాటం స్పిన్నర్‌ మనాల్‌ చౌహాన్‌ (ఐదు వికెట్లు) సమర్థంగా రాణిస్తున్నారు. వీరిద్దరూ అఫ్ఘాన్‌పైనా ఆకట్టుకుంటే భారత్‌కు తిరుగుండదు.

మరోవైపు అఫ్ఘానిస్థాన్‌ బ్యాటింగ్‌ ఫైసల్‌ రహీమీ, సుభాన్‌పై ఆధారపడి ఉంది. బౌలింగ్‌లో ఆ జట్టు ఆశలన్నీ నూర్‌ అలీ (13 వికెట్లు)పైనే ఉన్నాయి.

గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ జట్లు తలపడతాయి. గ్రూప్‌ ‘ఎ’ టాపర్‌గా నిలిచిన పాకిస్థాన్‌ ఇప్పటివరకు అజేయంగా ఉంది.

ఒక మ్యాచ్‌ ఓడిన బంగ్లాదేశ్‌ పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు