అర్ష్‌దీప్ సింగ్ ఎంగేజ్మెంట్, NewzFast Telugu: టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ జీవితంలో ఒకేరోజు రెండు శుభవార్తలు వచ్చాయి. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టులోకి ట్రేడ్ ద్వారా మారిన కొద్ది గంటల్లోనే ఆయన తన ప్రియురాలు సమ్రీన్ కౌర్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న అర్ష్‌దీప్ సింగ్, అక్కడ మోకాళ్లపై కూర్చుని సమ్రీన్ కౌర్‌కు ఉంగరం తొడిగి ప్రపోజ్ చేశారు. ఈ ఎంగేజ్మెంట్ వేడుక ఫోటోలను సమ్రీన్ కౌర్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
“జీవితం మనకిచ్చిన అత్యంత అద్భుతమైన కానుక మనమిద్దరం కలవడమే. ఇకపై మన ప్రయాణం జీవితాంతం కలిసి సాగుతుంది” అంటూ సమ్రీన్ కౌర్ భావోద్వేగమైన క్యాప్షన్ రాశారు.
ఈ వార్తపై పలువురు సినీ, క్రీడా ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
జమ్మూ కాశ్మీర్‌కు చెందిన సమ్రీన్ కౌర్ ప్రముఖ మోడల్, నటి. 2018లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో జమ్మూ కాశ్మీర్ తరఫున ఫైనలిస్ట్‌గా నిలిచారు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం 83తో ఆమె బాలీవుడ్ అరంగేట్రం చేశారు.
ఐపీఎల్ మ్యాచ్‌లకు పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లకు హాజరవుతూ అర్ష్‌దీప్ సింగ్‌ను ప్రోత్సహిస్తున్న సమయంలోనే వీరి ప్రేమకథ వెలుగులోకి వచ్చింది.
గత జులైలో అర్ష్‌దీప్ సింగ్ తన సోషల్ మీడియాలో సమ్రీన్ కౌర్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ “మై పర్సన్” అని రాసుకొచ్చి తమ బంధాన్ని అధికారికంగా ధ్రువీకరించారు.
27 ఏళ్ల అర్ష్‌దీప్ సింగ్ భారత క్రికెట్లో అత్యంత కీలకమైన బౌలర్‌గా ఎదిగారు. 2018 అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన ఆయన 2022లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. ప్రస్తుతం టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించారు.
అలాగే రెండుసార్లు టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టులోనూ ఆయన భాగస్వామిగా ఉన్నారు.




