ఆర్చియన్ కెమికల్స్ రూ.3,000 కోట్ల బ్యాటరీ ఫ్యాక్టరీకి సుముఖత, మంత్రి లోకేష్‌తో భేటీ

ఆర్చియన్ కెమికల్స్: ఆర్చియన్ కెమికల్ ఇండస్ట్రీస్ సిఇఓ & మేనేజింగ్ డైరక్టర్ రామ్‌ప్రవీణ్ స్వామినాథన్‌తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ విశాఖ సిఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ ప్రాంగణంలో భేటీ అయ్యారు. ఈ చర్చల అనంతరం రాష్ట్రంలో రూ.3,000 కోట్లతో జింక్-బ్రోమైడ్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ (2 × 5 జీడబ్ల్యూహెచ్/సంవత్సరం) ఏర్పాటుకు స్వామినాథన్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలోని యువతకు 1,000 ఉద్యోగాలు లభించనున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చిన ఆర్చియన్ సంస్థకు మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు.

ఆర్చియన్ కెమికల్స్, NewzFast Telugu (విశాఖపట్నం): ఆర్చియన్ కెమికల్ ఇండస్ట్రీస్ సిఇఓ & మేనేజింగ్ డైరక్టర్ రామ్‌ప్రవీణ్ స్వామినాథన్‌తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ విశాఖ సిఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ ప్రాంగణంలో భేటీ అయ్యారు.

ఈ చర్చల అనంతరం రాష్ట్రంలో రూ.3,000 కోట్లతో జింక్-బ్రోమైడ్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ (2 × 5 జీడబ్ల్యూహెచ్/సంవత్సరం) ఏర్పాటుకు స్వామినాథన్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలోని యువతకు 1,000 ఉద్యోగాలు లభించనున్నాయి.

రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చిన ఆర్చియన్ సంస్థకు మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ప్రాజెక్టు గ్రౌండింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు