ఏపీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు, NewzFast Telugu: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. సాయంత్రం వరకు ఫలితాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 659 జడ్పీ స్థానాల్లో 77 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 స్థానాల్లో పోలింగ్ జరిగింది.
అదేవిధంగా 9,821 ఎంపీటీసీ స్థానాల్లో 2,051 ఏకగ్రీవమయ్యాయి, 7,767 స్థానాలకు పోలింగ్ జరిగింది.
ఓట్ల లెక్కింపు కోసం 365 కేంద్రాల్లో 9,062 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 39,694 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు.
ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు.
లెక్కింపు కేంద్రాల వద్ద 40,679 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. కేంద్రాల లోపల, బయట సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.
ఫుటేజ్‌ను ఓట్ల లెక్కింపు పూర్తయిన 60 రోజుల వరకు భద్రపరుస్తారు.
ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. అనంతరం బ్యాలెట్ పత్రాలను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
ప్రతి టేబుల్‌కు ఒక రౌండ్లో 1,000 బ్యాలెట్ పత్రాలు ఇస్తారు.

