అనిరుధ్ కావ్య మారన్ వివాహం, NewzFast Telugu (గ్రీస్): ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ వివాహం ఘనంగా జరిగింది. గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న ఇద్దరు, పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు.
ఈ వివాహ వేడుకకు గ్రీస్ దేశం వేదికగా నిలిచింది.
తమిళ సంప్రదాయం ప్రకారం అందంగా ముస్తాబైన కావ్య, అనిరుధ్ నూతన వధూవరులుగా మెరిశారు. వివాహ క్రతువు ముగిసిన అనంతరం పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు.
వారు కలిసి నడిచి వస్తుండగా పూల వర్షం కురిపించారు, ఆ సమయంలో కెమెరాలు క్లిక్ మన్నాయి.
గ్రీస్ ప్రకృతి అందాల మధ్య జరిగిన ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఐశ్వర్య రజనీకాంత్ సహా కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
పెళ్లి అనంతరం కావ్య మారన్‌తో కలిసి దిగిన ఫోటోను అనిరుధ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. “నా జీవితంలో ఒకే ఒకసారి..
జీవితానికి సరిపడా.. 11.11″ అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సమంత, పూజా హెగ్డే, మంచు లక్ష్మి, ఊర్వశి రౌటేలా అందించిన శుభాకాంక్షలు వైరల్ అయ్యాయి.
అనిరుధ్, కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌ను నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విందుకు సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం.
ఇప్పటికే ఏఆర్ రెహమాన్, అజిత్, ధనుష్, అల్లు అర్జున్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆహ్వానాలు అందాయి.




