పరిషత్ పోలింగ్‌లో 15 జిల్లాల్లో 37 ఘటనలు: డీజీపీ

ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు: రాష్ట్రంలో జరిగిన జిల్లా, మండల పరిషత్ పోలింగ్ సందర్భంగా రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రం మొత్తం మీద 15 జిల్లాల్లో 37 ఘటనలు జరిగినట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లోనే అధికంగా ఘటనలు నమోదైనట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడే ప్రయత్నాలు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. శాంతిభద్రతలకు.

ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు, NewzFast Telugu: రాష్ట్రంలో జరిగిన జిల్లా, మండల పరిషత్ పోలింగ్ సందర్భంగా రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

రాష్ట్రం మొత్తం మీద 15 జిల్లాల్లో 37 ఘటనలు జరిగినట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లోనే అధికంగా ఘటనలు నమోదైనట్లు ఆయన వెల్లడించారు.

ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడే ప్రయత్నాలు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు, వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు