అండాల సేకరణ అక్రమ దందాపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు, 27 ఏఆర్టీ కేంద్రాల్లో తనిఖీలు

అండాల సేకరణ అక్రమ దందా: అండాల సేకరణ ముసుగులో జరుగుతున్న అక్రమ దందాపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ బృందాలు రాష్ట్రంలోని అన్ని ఐవీఎఫ్ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టాయి. రాష్ట్రంలో గుర్తించిన మొత్తం 44 ఏఆర్టీ (అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ) కేంద్రాలకు గాను ఇప్పటివరకు 27 కేంద్రాల్లో వైద్య అధికారులు తనిఖీలు పూర్తి చేశారు. ఇందులో ఏడు ఆస్పత్రుల్లో 13 నిబంధనల ఉల్లంఘనలను గుర్తించిన అధికారులు ఆయా.

అండాల సేకరణ అక్రమ దందా, NewzFast Telugu (హైదరాబాద్): అండాల సేకరణ ముసుగులో జరుగుతున్న అక్రమ దందాపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ బృందాలు రాష్ట్రంలోని అన్ని ఐవీఎఫ్ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టాయి.

రాష్ట్రంలో గుర్తించిన మొత్తం 44 ఏఆర్టీ (అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ) కేంద్రాలకు గాను ఇప్పటివరకు 27 కేంద్రాల్లో వైద్య అధికారులు తనిఖీలు పూర్తి చేశారు. ఇందులో ఏడు ఆస్పత్రుల్లో 13 నిబంధనల ఉల్లంఘనలను గుర్తించిన అధికారులు ఆయా ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

మిగిలిన కేంద్రాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.

పోలీసుల స్వాధీనంలో ఉన్న రికార్డులు, జాతీయ ఏఆర్టీ అండ్ సరోగసీ రిజిస్ట్రీ నుంచి అందే వివరాలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటారు. ఈ వ్యవహారానికి సంబంధించి పలువురు మహిళలను గుర్తించగా, వైద్యులు, ఐవీఎఫ్ కేంద్రాలు, మధ్యవర్తుల పాత్రపై విచారణ కొనసాగుతోంది.

దర్యాప్తులో భాగంగా న్యూఢిల్లీలోని నేషనల్ ఏఆర్టీ అండ్ సరోగసీ రిజిస్ట్రీని ఈనెల 6న రాష్ట్ర అధికారులు సందర్శించి, తెలంగాణలో నమోదైన ఏఆర్టీ కేంద్రాలు, ఏఆర్టీ బ్యాంకుల వివరాలను కోరారు. రాష్ట్రానికి సంబంధించిన సమాచారాన్ని అందజేస్తామని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అధికారులు హామీ ఇచ్చారు.

అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ) చట్టం-2021కి విరుద్ధంగా మహిళల నుంచి అండాలను సేకరించడం నేరమని వైద్యశాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ఏఆర్టీ క్లినిక్‌లు, ఏఆర్టీ బ్యాంకులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని, నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది.

ఆర్థిక ప్రలోభాలకు లోనై అక్రమ వైద్య విధానాలకు మహిళలు బలికావద్దని సూచించింది.

మహిళల అక్రమ అండాల సేకరణ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లోని 20కి పైగా ఫెర్టిలిటీ సెంటర్లకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు