అల్లరి నరేష్ ఆల్కహాల్, NewzFast Telugu (తెలుగు సినిమా): టాలీవుడ్లో కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించే అల్లరి నరేష్ ఈసారి సరికొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఆసక్తికరమైన చిత్రం ‘ఆల్కహాల్’ విడుదల తేదీని మేకర్స్ తాజాగా ప్రకటించారు.
ఇప్పటికే టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచిన ఈ సినిమా డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. ‘పిచ్చి ఎక్కించే సమయం మొదలైంది’ అంటూ ప్రత్యేక పోస్టర్‌తో మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
మద్యం ముట్టుకోని ఓ వ్యక్తి అనూహ్యంగా ప్రమాదకరమైన నేరాల ప్రపంచంలోకి ఎలా చిక్కుకున్నాడు, అతని జీవితంలో ఏ పరిణామాలు చోటుచేసుకున్నాయి అనే అంశాల చుట్టూ ఈ కథ సాగుతుందని ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ చెబుతున్నాయి. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో హైప్ పెరిగింది.
మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రుహాని శర్మ, నిహారిక ఎన్ఎం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.
కామెడీకి భిన్నంగా అల్లరి నరేష్‌ను సరికొత్త షేడ్స్‌లో చూడబోతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో విడుదల తర్వాతే తెలియనుంది.




