అక్షిత త్రోబాల్ స్వర్ణ పతకం, NewzFast Telugu (చందంపేట, దేవరకొండ): తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఈ నెల 7న నిర్వహించిన జాతీయ స్థాయి త్రోబాల్ ఫైనల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున పాల్గొన్న అక్షిత అద్భుత ప్రతిభ కనబర్చి స్వర్ణ పతకాన్ని సాధించింది.
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం చాకలిశేరిపల్లికి చెందిన ఆమె హైదరాబాద్‌కు చేరుకుని, మంగళవారం దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌తో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో సత్తాచాటిన అక్షిత తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు. మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ నెల 19 నుంచి 23 వరకు శ్రీలంకలో జరుగనున్న ఏషియన్ త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో అక్షిత భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
కేటీఆర్‌ను కలిసిన వారిలో బీఆర్ఎస్ నాయకులు కంకణాల వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్‌రెడ్డి, దొంతం చంద్రశేఖర్‌రెడ్డి, సర్పంచ్ మాచర్ల శ్రీశైలం తదితరులు ఉన్నారు.




