అచ్చంపేట బీజేపీ ఎస్సీ మోర్చా, NewzFast Telugu (అచ్చంపేట): అచ్చంపేట పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా ఎన్నికైన నారామోర్ల కార్తీక్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమాన్ని ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మండి కారి బాలాజీ, జిల్లా నాయకురాలు బల్మూరి జానకి, సోషల్ మీడియా జిల్లా ఇన్‌చార్జి అఖిల్ రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రాకేష్ వర్మ, పట్టణ ప్రధాన కార్యదర్శి రంగినేని రవీందర్ పాల్గొన్నారు.
ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శులు రాజు, భాస్కర్, బీజేపీ పదరా మండల అధ్యక్షులు నీలం రవి, ఎస్సీ మోర్చా అచ్చంపేట మండల అధ్యక్షులు గాలిముడి రాము, రవి తదితరులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నారామోర్ల కార్తీక్‌కు బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.




