జీవీ ప్రకాశ్‌కుమార్, గౌతమ్ వాసుదేవమీనన్ హారర్ థ్రిల్లర్ ‘13’ టైటిల్ ఖరారు

జీవీ ప్రకాశ్‌కుమార్ 13 హారర్ థ్రిల్లర్ సినిమా: జీవీ ప్రకాశ్‌కుమార్, గౌతమ్ వాసుదేవమీనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రానికి ‘13’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ అత్యంత ప్రతిష్టాత్మక ద్విభాషా చిత్రానికి వివేక్ కె దర్శకత్వం వహిస్తున్నారు. భవ్య త్రిఖ, ఆదిత్య కతిర్, ఐశ్వర్య, అధియా ప్రసాద్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రబృందం ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. దట్టమైన అటవీ నేపథ్యంలో సాగే ఈ సినిమా వాస్తవ సంఘటన స్ఫూర్తితో రూపొందుతోంది. 13 సంఖ్యకు సంబంధించిన.

జీవీ ప్రకాశ్‌కుమార్ 13 హారర్ థ్రిల్లర్ సినిమా, NewzFast Telugu: జీవీ ప్రకాశ్‌కుమార్, గౌతమ్ వాసుదేవమీనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రానికి ‘13’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ అత్యంత ప్రతిష్టాత్మక ద్విభాషా చిత్రానికి వివేక్ కె దర్శకత్వం వహిస్తున్నారు.

భవ్య త్రిఖ, ఆదిత్య కతిర్, ఐశ్వర్య, అధియా ప్రసాద్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రబృందం ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.

దట్టమైన అటవీ నేపథ్యంలో సాగే ఈ సినిమా వాస్తవ సంఘటన స్ఫూర్తితో రూపొందుతోంది. 13 సంఖ్యకు సంబంధించిన రహస్యం, దుష్టశక్తుల బారిన పడిన వ్యక్తుల పోరాటాన్ని ఇందులో ఆవిష్కరిస్తారని దర్శకుడు వివేక్ తెలిపారు.

ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా ఈ చిత్రం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సంగీతం సిద్ధు కుమార్, కెమెరా సీఎం మూవేందర్ అందిస్తున్నారు.

డిసెంబర్‌లో సినిమా విడుదల కానుంది.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు