వేలిముద్రల సాక్ష్యాధారం, NewzFast Telugu (అమరావతి): నేర నిర్ధారణలో వేలిముద్రల సాక్ష్యాధారం ఎంతో విలువైనదని ఫింగర్ ప్రింట్స్ బ్యూరో అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాల న్యాయమూర్తులు, జూనియర్ సివిల్ జడ్జీలకు అవగాహన సదస్సు నిర్వహించారు.
మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఫింగర్ ప్రింట్స్ డైరెక్టర్ కేవీ శ్రీనివాసరావు నేతృత్వంలోని నిపుణుల బృందం ఈ సదస్సులో పాల్గొంది.
నిపుణుల బృందం నేర స్థలం నుంచి సేకరించిన ఆధారాల పరిరక్షణ, విచారణలో వేలిముద్రల శాస్త్రీయ విశ్లేషణ, వాటి సాక్ష్యాధార విలువ వంటి అంశాలపై న్యాయాధికారులకు అవగాహన కల్పించింది.




