రాజ్‌తరుణ్ టార్టాయిస్, NewzFast Telugu: రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టార్టాయిస్’ నుంచి ‘రంగు రంగుపిల్లరో’ అనే పాట విడుదలైంది. రిత్విక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది.
ఈ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో బుధవారం చిత్ర బృందం ‘రంగు రంగుపిల్లరో’ పాటను విడుదల చేసింది. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ పాటను పెంచల్దాస్ రచించారు.
జానపద శైలిలో సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, రాజ్‌తరుణ్ పాత్ర కొత్త పంథాలో ఉంటుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాతలు విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం రిత్విక్ కుమార్.




