జయంత్ అండ్ ది జింగో పెన్, NewzFast Telugu: మాస్టర్ జయంత్ బొలిశెట్టి, ఊహా రెడ్డి, సత్యం రాజేష్, అశిష్ గాంధీ, మానస రాధకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రానికి నవీన్ దేశబోయిన దర్శకత్వం వహించగా, దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మించారు. మంగళవారం ఈ చిత్రానికి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
పిల్లల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం వినోదంతో పాటు సందేశాన్ని కలబోసి ఆకట్టుకుంటుందని దర్శకుడు నవీన్ దేశబోయిన తెలిపారు. ఈ కథలోని భావోద్వేగాలు హృదయాన్ని కదిలిస్తాయని చెప్పారు.
చిల్డ్రన్స్ డే కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి పేర్కొన్నారు. పిల్లలందరూ కలిసి చూడదగ్గ మంచి చిత్రం ఇటీవల కాలంలో రాలేదని, గొప్ప సందేశంతో ఈ సినిమా రూపొందిందని నటుడు తనికెళ్ల భరణి ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.




