ఉన్నత విద్యలో డిజిటల్ పాఠ్యాంశాలు: ఎల్ఎంఎస్-మూక్స్ వేదిక నేడు ప్రారంభం
ఉన్నత విద్యామండలి డిజిటల్ పాఠ్యాంశాలు: ఉన్నత విద్య కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆన్లైన్ పాఠ్యాంశాలను ఉన్నత విద్యామండలి అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం ఎల్ఎంఎస్-మూక్స్ వేదికను రూపొందించింది. ఈ వేదికను ఉన్నత విద్యామండలి ఇన్చార్జ్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.విజయభాస్కరరావు బుధవారం ప్రారంభించనున్నారు. దీన్ని విద్యార్థులతో పాటు ఫ్యాకల్టీ కూడా ఉపయోగించుకోవచ్చని మండలి తెలిపింది. ఈ విధానంలో పూర్తిచేసే కోర్సులకు క్రెడిట్లు కూడా ఇస్తారు. విద్యార్థులు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుని డిజిటల్ కోర్సులను నేర్చుకోవచ్చు.
ఉన్నత విద్యామండలి డిజిటల్ పాఠ్యాంశాలు, NewzFast Telugu (అమరావతి): ఉన్నత విద్య కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆన్లైన్ పాఠ్యాంశాలను ఉన్నత విద్యామండలి అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం ఎల్ఎంఎస్-మూక్స్ వేదికను రూపొందించింది.
ఈ వేదికను ఉన్నత విద్యామండలి ఇన్చార్జ్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.విజయభాస్కరరావు బుధవారం ప్రారంభించనున్నారు. దీన్ని విద్యార్థులతో పాటు ఫ్యాకల్టీ కూడా ఉపయోగించుకోవచ్చని మండలి తెలిపింది.
ఈ విధానంలో పూర్తిచేసే కోర్సులకు క్రెడిట్లు కూడా ఇస్తారు. విద్యార్థులు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుని డిజిటల్ కోర్సులను నేర్చుకోవచ్చు.