ఎల్ఐసీ త్రైమాసిక లాభం, NewzFast Telugu: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి సంస్థ రూ.12,076 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.10,053 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 20 శాతం వృద్ధి. బీఎస్ఈకి అందించిన సమాచారం ప్రకారం, ఇదే కాలంలో సంస్థ ఆదాయం రూ.2,39,614 కోట్ల నుంచి రూ.2,62,739 కోట్లకు పెరిగింది.
ఆదాయంలో నూతన ప్రీమియం వసూళ్ల ద్వారా రూ.1,47,018 కోట్లు, రెన్యువల్ ప్రీమియం వసూళ్ల ద్వారా రూ.68,375 కోట్లు సమకూరాయి. అయితే తొలి ఏడాది ప్రీమియం వసూళ్లు రూ.10,836 కోట్ల నుంచి రూ.10,432 కోట్లకు తగ్గినట్టు సంస్థ పేర్కొంది.

