కోదాడ బీఆర్ఎస్ చేరికలు, NewzFast Telugu (కోదాడ): కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన యువత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గురువారం కోదాడ పట్టణ పరిధిలోని 18వ వార్డులో ఈ చేరికలు జరిగాయి.
వినయ్, మీసాల నాని, రాము, సతీష్, వేణు, మణికంఠ, రాకేష్, పవన్, నవీన్ తదితరులు పార్టీలను వీడి బీఆర్ఎస్లో చేరగా, వారికి గులాబీ కండువాలు కప్పి మల్లయ్య యాదవ్ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలతో మండల, గ్రామ స్థాయిలో ఆ పార్టీ విశ్వసనీయత కోల్పోయిందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అమలు చేసిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, రైతులు, పేదలు, మహిళలు, యువతకు బీఆర్ఎస్ అండగా నిలిచిందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధులు నిలిచిపోయే పరిస్థితి ఉందని విమర్శించారు.
రానున్న రోజుల్లో ప్రజలు మరోసారి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రానున్న ఖమ్మం-నల్లగొండ-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత ఉత్సాహంగా పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
