ఆరోగ్యకరమైన భూమి భూసారం రైతులు, NewzFast Telugu (సైదాపూర్): సైదాపూర్ వెన్నంపల్లి రైతు వేదికలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గురువారం ఖేత్ బచావో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్ మాట్లాడుతూ, భూసారాన్ని కాపాడుకోవడం ప్రతి రైతు బాధ్యత అని అన్నారు. విత్తన శుద్ధి చేయడంతో పాటు రసాయన ఎరువులకు బదులుగా జీవ ఎరువులు వినియోగించాలని ఆయన సూచించారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున ఆరుతడి పంటలు సాగు చేయాలని శాస్త్రవేత్త సూచించారు. వీలుకాని రైతులు సాధారణంగా వేసే వరి విస్తీర్ణంలో సగం మాత్రమే సాగు చేసి పంటను కాపాడుకోవాలన్నారు.
కార్యక్రమంలో ఏఈఓ ప్రేమ్‌సాగర్, వెన్నంపల్లి సర్పంచ్ చిరంజీవి, లస్మన్నపల్లి సర్పంచ్ మ్యాకల స్వప్న-సంపత్ రెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు పంతంగి రవీందర్ గౌడ్, రైతులు పాల్గొన్నారు.
