AP DSC నోటిఫికేషన్ 2026, NewzFast Telugu (విజయవాడ): ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ యాజమాన్యాల పరిధిలోని ఈ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు నవంబర్ 11 నుంచి 30 వరకు స్వీకరిస్తారు.
జనరల్ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీలకు 2,111 పోస్టులు, ప్రత్యేక విద్యలో 350 పోస్టులు, వివిధ సొసైటీల పరిధిలో 260 పోస్టులు కేటాయించారు. పోస్టుల రిజర్వేషన్ రోస్టర్, హారిజాంటల్ వివరాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
డీఎస్సీ పరీక్షలను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) నిర్వహిస్తారు. డిసెంబర్ 20 నుంచి జనవరి 13 వరకు రాతపరీక్షలు కొనసాగుతాయి.
అభ్యర్థుల సన్నాహాల కోసం డిసెంబర్ 5 నుంచి ఆన్లైన్ మాక్‌టెస్టులు అందుబాటులోకి వస్తాయి.
డిసెంబర్ 14 నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రీడాకోటా అభ్యర్థులకు ప్రత్యేకంగా రాతపరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్షలు ముగిసిన రెండు రోజులకు ప్రాథమిక ‘కీ’ విడుదల చేస్తారు. దీనిపై అభ్యంతరాలు తెలియజేసేందుకు వారం రోజుల గడువు ఇస్తారు.
ఆ తర్వాతి వారంలో పరిశీలించి తుది ‘కీ’ని ప్రకటిస్తారు.

