సౌదీలో హూతీల దాడిలో గాయపడ్డ తెలంగాణ వ్యక్తి మృతి, NewzFast Telugu (రియాద్): సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై గతనెలలో హూతీలు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న తెలంగాణ వ్యక్తి మృతి చెందారు. ఈ విషయాన్ని భారత ఎంబసీ బుధవారం ప్రకటించింది.
కామారెడ్డిలోని సైలానిబాబా కాలనీకి చెందిన షేక్ సయీద్ (40) అక్టోబరు 10న రియాద్ ఎయిర్‌పోర్ట్‌లోని ప్రఖ్యాత కాఫీ షాపులో పని చేస్తుండగా హూతీల దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఆయన మరణించారు.
రియాద్ నగరంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మృతుడి ఇద్దరు సోదరులు కూడా సౌదీలోనే పని చేస్తున్నారు.
సయీద్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
దాడి జరిగినప్పటి నుంచి విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయడంతో భారత్ నుంచి మృతుడి కుటుంబ సభ్యులు రాలేకపోయారు.
