ఎల్విస్ స్టీఫెన్సన్ జీవో 134 హైకోర్టు స్టే, NewzFast Telugu (హైదరాబాద్): బీఆర్ఎస్ మాజీ ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు చెందిన భూమికి మాత్రమే వర్తించేలా జీవో 134పై స్టే విధిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తనతోపాటు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్కు చెందిన 16 మంది నాయకుల భూములను నిషేధిత జాబితాలో చేరుస్తూ ఇచ్చిన జీవో 134ను కొట్టేయాలని కోరుతూ స్టీఫెన్సన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
వాదనలు విన్న ధర్మాసనం, పిటిషనర్ స్టీఫెన్సన్కు చెందిన స్థలం వరకు జీవో 134పై స్టే విధించింది. వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణ డిసెంబరు 2కు వాయిదా పడింది.

