కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీ విమర్శలు, NewzFast Telugu (హైదరాబాద్): ఢిల్లీ పార్టీల వల్ల తెలంగాణకు ఏనాడు న్యాయం జరగలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ సంచులు మోసే పార్టీ అయితే, బీజేపీ చెప్పులు మోసే పార్టీగా మారిందని ఆయన అన్నారు.
ఆ రెండు పార్టీలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర హక్కులను ఢిల్లీ నాయకత్వాల ముందు తాకట్టు పెడుతున్నాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ఆ పార్టీల నాయకులు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.
సీఎం రేవంత్‌రెడ్డి వారానికి రెండుసార్లు ఢిల్లీకి వెళ్తున్నారని, పాలన కంటే ఢిల్లీ పర్యటనలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రియాంక గాంధీ బౌన్సర్లు ఆయనను నెట్టివేసిన ఘటనను ప్రస్తావించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ అమిత్ షా ముందు బౌన్సర్‌లా వ్యవహరిస్తున్నారని, బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు అమిత్ షా కాళ్లకు నమస్కరించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.
మియాపూర్‌లోని 550 ఎకరాల భూములను కోర్టు తీర్పు వచ్చిన 24 గంటల్లోనే అమ్మేస్తామని ప్రకటించడం వెనుక కమీషన్ల ఆంతర్యం ఉందని కేటీఆర్ ఆరోపించారు. ఆ భూములను తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, హైదరాబాద్ పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
