Srivari Mettu NRI devotee heart attack death, NewzFast Telugu (Tirumala, Chandragiri mandal): తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఎన్ఆర్ఐ భక్తుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు.
ఈ ఘటన 800వ మెట్టు వద్ద జరిగింది. శ్రీవారి దర్శనానికి కాలినడకన వెళ్తున్న భక్తుడికి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
మృతుడిని అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రానికి చెందిన ఎన్ఆర్ఐ సింగిరెడ్డి సుర్జిత్‌రెడ్డి (53)గా గుర్తించారు. ఆయన అమెరికాలోని బోర్డెన్ టౌన్‌లో నివసిస్తున్నారు.
కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లిన ఆయన, మంగళవారం సాయంత్రం చంద్రగిరి మండలంలోని శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్తుండగా ఈ విషాదం జరిగింది.
టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి, అక్కడి నుంచి అశ్విని ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

