Royal Enfield Continental GT 750, NewzFast Telugu: ప్రముఖ టూ వీలర్ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ EICMA 2026 వేదికగా కాంటినెంటల్ GT 750ను ఆవిష్కరించింది. ఇప్పటికే హిమాలయన్ 750లో పరిచయం చేసిన కొత్త 743cc ట్విన్ సిలిండర్ ఇంజిన్నే ఈ బైక్‌లోనూ ఉపయోగించింది.
ఇంజిన్ ఒకటే అయినప్పటికీ డిజైన్, ఫీచర్లు, రైడింగ్ అనుభవంలో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. హిమాలయన్ 750లో ఈ ఇంజిన్ 55hp పవర్, 63Nm టార్క్ ఇస్తుంది.
కాంటినెంటల్ GT 750లో కూడా దాదాపు ఇదే పనితీరు ఉండే అవకాశం ఉంది.
హిమాలయన్‌లో ఎలక్ట్రానిక్ థ్రాటిల్ ఉండగా, ఈ బైక్‌లో కేబుల్ ఆపరేటెడ్ థ్రాటిల్ ఇచ్చారు. సింగిల్ ఎగ్జాస్ట్‌కు బదులుగా ట్విన్ ఎగ్జాస్ట్ పైపులను ఏర్పాటు చేశారు.
ఇవి బైక్ రూపాన్ని మరింత ప్రత్యేకంగా చూపిస్తాయి.
బ్రేకింగ్ కోసం ముందు భాగంలో డ్యూయల్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. సస్పెన్షన్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఇచ్చారు.
వీటిని ప్రీలోడ్ అడ్జస్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
డిజైన్‌లో రెట్రో లుక్‌ను కొనసాగిస్తూ కొత్త ఫీచర్లను జోడించారు. రెండు అనలాగ్ మీటర్ల మధ్య చిన్న TFT డిస్ప్లే ఉంటుంది.
మెటల్ స్విచ్ క్యూబ్స్ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి.
ఈ బైక్ మాస్టర్ క్లీన్, రెడ్ లైన్, TT బ్లూ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. మొదటి రెండు వేరియంట్లలో క్రోమ్ ఫినిష్, వైర్ స్పోక్ వీల్స్ ఉంటాయి.
TT బ్లూ వేరియంట్లో అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు ఇచ్చారు.
అదే సమయంలో రాయల్ ఎన్ఫీల్డ్ తన రెండో ఎలక్ట్రిక్ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ S6 ప్రొడక్షన్ వెర్షన్‌ను కూడా పరిచయం చేసింది. స్క్రాంబ్లర్ డిజైన్‌తో వచ్చిన ఈ మోడల్ వచ్చే ఏడాది మార్కెట్లోకి రావచ్చని అంచనా.
కాంటినెంటల్ GT 750 భారత మార్కెట్లో వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో విడుదల కావచ్చని తెలుస్తోంది.

