విరాట్ కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్ ఆక్లాండ్ వన్డే, NewzFast Telugu (ఆక్లాండ్): న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్ పట్టాడు.
అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో నాథన్ స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్స్‌లో కోహ్లీ అందుకున్నాడు. కుడి వైపు డైవ్ చేసి ఒంటి చేతితో బంతిని పట్టుకున్నాడు.
క్యాచ్ అందుకున్న తర్వాత కోహ్లీ ఆర్చరీ సెలబ్రేషన్ చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ తాజా సమాచారం ప్రకారం 38 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సీఫర్ట్ 38, మిచెల్ 28, ఫిలిప్స్ 30 పరుగులు చేశారు.
అర్షదీప్ 4 వికెట్లు తీసుకోగా, కాంబోజ్ మరియు గుర్నూర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
