ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు: టీడీపీ ఆధిక్యం, కూటమికి స్పష్టమైన మెజారిటీ

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు: రాష్ట్రంలోని పలు ప్రధాన నగరాలు, పట్టణ కార్పొరేషన్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించి ఆధిక్యం ప్రదర్శించారు. కడపలో సువర్ణ, విజయనగరంలో భార్గవి, గ్రేటర్ విశాఖలో శ్రావణి, మచిలీపట్నంలో అబ్దుల్ అబిదా, చిత్తూరులో హేమలత, గుంటూరులో లక్ష్మీఅపర్ణ, నెల్లూరులో రూప్ కుమార్, కర్నూలులో విజయ ప్రత్యూష, తిరుపతిలో శ్రీనివాసప్రసాద్ విజేతలుగా నిలిచారు. దీంతో మొత్తం తొమ్మిది కార్పొరేషన్లలో టీడీపీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. జనసేన పార్టీ ఏలూరులో అప్పలనాయుడు, విజయవాడలో రాధాకృష్ణ విజేతలుగా నిలిచి రెండు కార్పొరేషన్లలో.

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు, NewzFast Telugu: రాష్ట్రంలోని పలు ప్రధాన నగరాలు, పట్టణ కార్పొరేషన్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించి ఆధిక్యం ప్రదర్శించారు.

కడపలో సువర్ణ, విజయనగరంలో భార్గవి, గ్రేటర్ విశాఖలో శ్రావణి, మచిలీపట్నంలో అబ్దుల్ అబిదా, చిత్తూరులో హేమలత, గుంటూరులో లక్ష్మీఅపర్ణ, నెల్లూరులో రూప్ కుమార్, కర్నూలులో విజయ ప్రత్యూష, తిరుపతిలో శ్రీనివాసప్రసాద్ విజేతలుగా నిలిచారు. దీంతో మొత్తం తొమ్మిది కార్పొరేషన్లలో టీడీపీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

జనసేన పార్టీ ఏలూరులో అప్పలనాయుడు, విజయవాడలో రాధాకృష్ణ విజేతలుగా నిలిచి రెండు కార్పొరేషన్లలో విజయం సాధించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనంతపురంలో రమేశ్ గౌడ్ గెలుపొందారు.

ఈ ఫలితాలతో కార్పొరేషన్లలో కూటమి పార్టీలకు స్పష్టమైన ఆధిక్యం లభించినట్లయింది. అయితే ఒంగోలు మేయర్ ఎన్నిక ఫలితం ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

ఆ ఫలితం వెలువడిన తర్వాత మొత్తం కార్పొరేషన్లలో పార్టీల బలాబలాలపై మరింత స్పష్టత రానుంది.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు