మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్క ఓటు తేడా విజయాలు, NewzFast Telugu (సాలూరు, ఇచ్ఛాపురం, పలాస): మున్సిపల్ ఫలితాల్లో కొన్ని చోట్ల అతి తక్కువ ఓట్లు విజేతలను నిర్ణయించాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు.
సాలూరు 25వ వార్డులో టీడీపీ అభ్యర్థి 418 ఓట్లు సాధించగా, వైసీపీ అభ్యర్థి బీసపు హైమావిజయలక్ష్మి 419 ఓట్లతో గెలిచారు. ఇక్కడ నోటాకు 8 ఓట్లు పడ్డాయి.
రీకౌంటింగ్ జరిగినప్పటికీ వైసీపీ అభ్యర్థే ఒక్క ఓటు తేడాతో విజేతగా నిలిచారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మున్సిపాలిటీ 18వ వార్డులో వైసీపీ అభ్యర్థి పిలక ఈశ్వరి, టీడీపీ అభ్యర్థి సరస్వతిపై 6 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 26వ వార్డులో జనసేన అభ్యర్థి దాసరి శేఖర్, వైసీపీ అభ్యర్థి కాళ్ల ధర్మతేజపై 3 ఓట్ల తేడాతో గెలిచారు.
పలాస 35వ వార్డులో టీడీపీ అభ్యర్థి జోగ త్రివేణి, వైసీపీ అభ్యర్థి అరుణలకు సమానంగా 340 ఓట్లు వచ్చాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు ఎన్.
సూర్యతేజ సమక్షంలో లాటరీ పద్ధతిలో విజేతను నిర్ణయించారు. లాటరీలో వైసీపీ అభ్యర్థి అరుణ పేరు రావడంతో ఆమెను విజేతగా ప్రకటించారు.

