జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై ప్రభుత్వ జాప్యంపై ఇందిరాపార్కు వద్ద ధర్నా

జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కేటాయింపు: జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడం సరికాదని పలువురు జర్నలిస్టు సంఘాల నాయకులు పేర్కొన్నారు. మంగళవారం ఇందిరాపార్కు వద్ద జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 18 ఏళ్ల క్రితం సొసైటీకి పేట్‌బషీరాబాద్, నిజాంపేటల్లో కేటాయించిన స్థలాలను సభ్యులకు ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం అన్యాయమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్ల స్థలాల అంశంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని వారు కోరారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలను.

జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కేటాయింపు, NewzFast Telugu (హైదరాబాద్): జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడం సరికాదని పలువురు జర్నలిస్టు సంఘాల నాయకులు పేర్కొన్నారు. మంగళవారం ఇందిరాపార్కు వద్ద జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

18 ఏళ్ల క్రితం సొసైటీకి పేట్‌బషీరాబాద్, నిజాంపేటల్లో కేటాయించిన స్థలాలను సభ్యులకు ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం అన్యాయమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్ల స్థలాల అంశంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని వారు కోరారు.

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలను కేటాయించేలా ప్రత్యేక జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఇచ్చిన హామీ అమలు కాలేదని వారు విమర్శించారు.

ధర్నాలో సీనియర్ పాత్రికేయుడు ఎంవీఆర్ శాస్త్రి, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గోపరాజు, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, పలువురు సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు