పాకెట్ రాకెట్స్ సినిమా టీజర్, NewzFast Telugu (హైదరాబాద్): నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’ టీజర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో మేకర్స్ విడుదల చేశారు.
రుద్ర ఆత్రి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాతలుగా ఉన్నారు. ‘కమిటీకుర్రోళ్లు’ ఫేం త్రినాథ్‌వర్మ, నిర్మల్, శ్రియా కొంతం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
గ్యాంబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ విభిన్న కథాచిత్రంలో జేడీ చక్రవర్తి కీలక పాత్రధారి. ప్రెస్మీట్లో నిహారిక కొణిదెల మాట్లాడుతూ, జూలైలో షూటింగ్ మొదలుపెట్టి ఆరు నెలల్లో పూర్తి చేసినట్లు తెలిపారు.
సినిమా డిసెంబర్ 11న థియేటర్లలోకి రానున్నట్లు ఆమె పేర్కొన్నారు. రెండు గంటల పాటు హాయిగా నవ్వించే చిత్రమని నిర్మాత రాహుల్ రాఘవేంద్ర చెప్పారు.
ఈ చిత్రానికి కెమెరా ఎదురోలు రాజు, సంగీతం గ్యానీ అందిస్తున్నారు.

