నటుడు గిరిబాబు మృతి, NewzFast Telugu: ప్రముఖ సీనియర్ నటుడు, దర్శక-నిర్మాత గిరిబాబు మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన సీనియర్ కళాకారుడిని కోల్పోవడం బాధాకరమని ఇద్దరు నేతలు పేర్కొన్నారు.
చంద్రబాబు నివాళి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా గిరిబాబు సినీ ప్రస్థానాన్ని స్మరించుకున్నారు. ప్రకాశం జిల్లాలో ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించిన గిరిబాబు ఐదు దశాబ్దాల పాటు 600కు పైగా చిత్రాల్లో నటించి, విలన్‌గా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను మెప్పించారని ఆయన తెలిపారు.
ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
నారా లోకేశ్ సంతాపం
మంత్రి నారా లోకేశ్ కూడా గిరిబాబు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలపాటు 600కు పైగా సినిమాల్లో నటించడంతో పాటు దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఆయన తన ప్రతిభను చాటుకున్నారని లోకేశ్ పేర్కొన్నారు.
ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరనిలోటని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు.




