భారత్-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్ టిక్కెట్లు, NewzFast Telugu: వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఉమ్మడి ఆతిథ్యంలో జరిగే వన్డే ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.
2027 అక్టోబర్ 10న జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం ఐసీసీకి దాదాపు 84 లక్షల టిక్కెట్ దరఖాస్తులు వచ్చాయి. ఈ మైదానం సామర్థ్యం 34 వేల సీట్లు మాత్రమే కావడంతో ప్రతి టిక్కెట్‌కు 247 మంది పోటీ పడుతున్నారు.
అదే మైదానంలో 2027 నవంబర్ 21న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు 79 లక్షల దరఖాస్తులు రాగా, లీగ్ దశలోని ఇండో-పాక్ పోరుకే అత్యధిక డిమాండ్ ఉండటం గమనార్హం.
14 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ మ్యాచ్‌ల కోసం 193 దేశాల నుంచి 12 కోట్లకు పైగా దరఖాస్తులు నమోదయ్యాయి. టిక్కెట్ల విండో నవంబర్ 21 వరకు అందుబాటులో ఉంటుంది.
అధిక డిమాండ్ ఉన్న మ్యాచ్‌లకు కంప్యూటరైజ్డ్ రాండమ్ లాటరీ ద్వారా టిక్కెట్లు కేటాయించనున్నారు.
