నారాయణపేట దళిత సర్పంచ్ ఇంటి వద్ద బుల్డోజర్ల హల్‌చల్, చివరకు ఇంటిని తానే కూల్చుకున్న కృష్ణ

నారాయణపేట దళిత సర్పంచ్ కృష్ణ ఇంటి కూల్చివేత వివాదం: కోస్గి మండలం చెన్నారం గ్రామంలో అధికారులు పోలీసుల సాయంతో బుల్డోజర్లతో సర్పంచ్ ఇంటి వద్దకు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. రెండ్రోజుల గడువు ఇచ్చినా అధికారులు మళ్లీ రావడంపై బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సూచనల మేరకు సర్పంచ్ కృష్ణ తన ఇంటిని తానే తొలగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అధికారుల తీరును తప్పుబట్టారు.

నారాయణపేట దళిత సర్పంచ్ కృష్ణ ఇంటి కూల్చివేత వివాదం, NewzFast Telugu (నారాయణపేట జిల్లా కోస్గి మండలం): దళిత సర్పంచ్ కృష్ణ ఇంటిపై అధికారులు మరోసారి చర్యలకు దిగారు. ఈసారి పోలీసుల సహాయంతో బుల్డోజర్లతో సర్పంచ్ ఇంటి వద్దకు వచ్చారు.

సోమవారం డీఈ చేసిన వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి ప్రథమ పౌరుడైన సర్పంచ్ పట్ల అధికారులు ఈ విధంగా వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడ్డారు.

సర్పంచ్ కృష్ణ సూచన మేరకు రెండ్రోజుల పాటు కూల్చివేత ప్రయత్నాన్ని విరమించుకుంటామని అధికారులు చెప్పినట్లు తెలిసింది. అయినప్పటికీ మంగళవారం మళ్లీ బుల్డోజర్లతో ఇంటి వద్దకు రావడం చర్చనీయాంశమైంది.

విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు సర్పంచ్‌కు మద్దతుగా అక్కడికి చేరుకున్నారు. రెండ్రోజుల గడువు ఇచ్చినా ఒక్కరోజు కూడా గడవకముందే బుల్డోజర్లతో రావడంపై బీఆర్‌ఎస్ కోస్గి ఇన్‌చార్జి వెంకట్ నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం సర్పంచ్ కృష్ణ అధికారులు సూచించిన మేరకు, నిబంధనల ప్రకారం తన ఇంటిలోని భాగాన్ని తానే తొలగించుకున్నారు.

ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి స్పందించారు. దళిత సర్పంచ్ పట్ల అధికారులు వ్యవహరించిన తీరు హేయనీయమని అన్నారు.

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇలాకాలోనే అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

అభివృద్ధికి సహకరిస్తామని బాధితులు చెబుతున్నప్పటికీ అధికారులు భిన్నంగా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. ఇండ్లు కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లించాలని, ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని, ఖాళీ స్థలం లేని పేదలకు స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు