స్థానిక సంస్థల ఎన్నికల సిబ్బంది పారితోషికం పెంపు, NewzFast Telugu (అమరావతి): స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పారితోషికాన్ని పెంచుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రిసైడింగ్ ఆఫీసర్ లేదా కౌంటింగ్ సూపర్వైజర్కు గతంలో రోజుకు రూ.350 ఇవ్వగా, ఇప్పుడు రూ.500కు పెంచారు. లేదా మొత్తంగా రూ.2,000 చెల్లిస్తారు.
పోలింగ్ ఆఫీసర్‌కు రోజుకు రూ.250 నుంచి రూ.400కు పెంచగా, మొత్తంగా రూ.1,600 చెల్లిస్తారు.
కౌంటింగ్ అసిస్టెంట్‌కు రోజుకు రూ.250 నుంచి రూ.450కు పెంచారు. లేదా మొత్తంగా రూ.1,350 చెల్లిస్తారు.
మైక్రో అబ్జర్వర్లకు గతంలో ఇచ్చిన రూ.1,000 నుంచి రూ.2,000కు పెంచారు.
సిబ్బందికి ప్యాక్డ్ లంచ్ కోసం ఇచ్చే మొత్తాన్ని రూ.500కు పెంచారు. నిఘా బృందాల్లోని క్లాస్-1, క్లాస్-2 ఉద్యోగులకు రూ.1,200 నుంచి రూ.3,000కు, క్లాస్-3 ఉద్యోగులకు రూ.1,000 నుంచి రూ.2,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.


