గుడిపాడు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్, NewzFast Telugu (కర్నూలు జిల్లా): కర్నూలు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోడుమూరు సీఐ తబ్రేజ్, గూడూరు ఎస్ఐ రాజాకుళాయప్ప ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసు సిబ్బంది గుడిపాడు గ్రామంలో విస్తృతంగా CASO (కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్) నిర్వహించారు.
తనిఖీలు, స్వాధీనం
ఈ ఆపరేషన్‌లో భాగంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమతి పత్రాలు లేని అనధికారిక వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ప్రజలు తమ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి అవసరమైన ధ్రువపత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని పోలీసులు సూచించారు.
ఎన్నికల నేపథ్యంలో అవగాహన
త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామ ప్రజలకు ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని పోలీసులు కోరారు.
గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని, ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.




