మధుమేహ పరీక్షలు, NewzFast Telugu (అమరావతి): ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఒకే రోజు కనీసం లక్ష మంది వైద్య ఆరోగ్య సిబ్బందికి మధుమేహంతో పాటు ఇతర సాధారణ దీర్ఘకాలిక వ్యాధుల పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
కార్యక్రమం ఉద్దేశం
‘లక్షకు రక్షణ లక్ష్యం’ నినాదంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. వ్యాధుల ముందస్తు గుర్తింపు, నివారణ, ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించడం దీని లక్ష్యమని శాఖ పేర్కొంది.
ఎవరు పాల్గొంటారు
ఆరోగ్య సిబ్బంది ముందుగా తమకు తాము పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైద్యులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని శాఖ కోరింది.




